మోత్కుపల్లి పశ్చాత్తాపం…!!
టీటీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు ఆమధ్య తాను చేసిన పార్టీ విలీన వ్యాఖ్యల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
టీటీడీపీ కేడర్ కు క్షమాపణ చెప్పారు మోత్కుపల్లి. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండన్నారాయన. తన రాజకీయ గురువు ఎన్టీఆరేనని, చంద్రబాబు సహకారంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఉద్యమకాలం లో తెలంగాణ ద్రోహిగా ముద్రవేసుకుని కూడా బాబుకు రక్షణ కవచంగా నిలిచానని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ కు ఎలా ఉన్నానో చంద్రబాబు కు కూడా అంతే నమ్మకంగా పనిచేశానన్నారు.బాబు తనకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా తాను బాబుకు తమ్ముడినేనన్నారు. కానీ తాను లేకుండా నిన్న టీటీడీపీ సమావేశం జరగడం బాధను వ్యక్తం చేశారు. టీటీడీపీ పరువును బజారున వేసింది రేవంత్ రెడ్డి అని, ఆయన వల్లనే బాబు మీద మచ్చ పడిందని, ఆనాడే రేవంత్ రెడ్డి ని సస్పెండ్ చేస్తే పార్టీకి ఈ గతి వచ్చేది కాదని అన్నారు.
టీటీడీపీలో నాయకత్వలోపం ఉందని, వంటెరు ప్రతాప్ రెడ్డి ని పోలీస్ లు అరెస్ట్ చేస్తే పార్టీ నాయకత్వం సరిగా ఉద్యమించలేదన్నారు మోత్కుపల్లి. బాబు వస్తేనే పార్టీ తిరిగి బలోపేతం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.