రైతుల ఆవేదనని కేంద్రం వినాల్సిందే
రైతుల ఆందోళనలని కాంగ్రెస్ టేకప్ చేసింది. రైతుల పక్షంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలని ముమ్మరం చేసింది.గురువారం కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌధురితో కలిసి రాహుల్ గాంధీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు.
తాజాగా ట్విటర్ వేదికగా.. రైతుల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. ‘కొత్త సాగు చట్టాల రద్దే లక్ష్యంగా ఆందోళన చేస్తున్న రైతుల ఆవేదనను ప్రభుత్వం ఆలకించాల్సిందే. వారి ఆవేదనకు మట్టిలోని ప్రతి రేణువు ప్రతిస్పందిస్తోంది. ప్రభుత్వం సైతం వినాల్సిందేనని’ రాహుల్ డిమాండ్ చేశారు.