శభాష్.. శుభ్మన్ !
బాక్సిండ్ డే టెస్టులో తొలిరోజు టీమిండియా అదరగొట్టేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ని 195 పరుగులకే కట్టడి చేసింది. ఆపై బ్యాటింగ్ కి దిగిన టీమిండియా వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న శుభమన్ గిల్ 28 పరుగులతో అజేయంగా నిలిచారు. టీమిండియా తొలి ఓవర్ ఆఖరి బంతికే మయాంక్ వికెట్ పొగొట్టుకుంది. అయితే గిల్ అటాకింగ్ గేమ్ ఆడి.. ఒత్తిడి తగ్గించాడు. ఎంతో అనుభవం గల ఆటగాడిగా కనిపించాడు.
అంతకుముందు ఆసీస్ 195 పరులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3. సిరాజ్ 2 వికెట్లు తీశారు.ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మాథ్యూ వేడ్ 30, లబుషనే 48, ట్రావెస్ హెడ్ 38, లయాన్ 20 రన్స్ చేశారు. ఈ మ్యాచ్లో భారత్ తరపున అరంగేట్రం చేసిన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. 15 ఓవర్లు వేసిన సిరాజ్ తన బౌలింగ్లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. లబుషనే, గ్రీన్ వికెట్లను సిరాజ్ తీసుకున్నాడు.