వైరల్ : సునీత-రామ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫోటోస్
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపునేనిని పెళ్లాడనుంది. ఇటీవల వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది. వచ్చే నెలలో పెళ్లి వేడుక జరగనుందని చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం స్నేహితులు, సన్నిహితుల కోసం ఈ జంట ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేసింది. గచ్చిబౌలిలోని BOULDER HILLSలో ఏర్పాటు చేసిన ఈ పార్టీకి ఇండస్ట్రీ నుంచి అత్యంత సన్నిహితులు హాజరయ్యారు.
ఇదే తొలి ఫ్రీ వెడ్డింగ్ పార్టీ కాదు. ఇటీవల ఈ జంట ప్రత్యేకంగా ఓ పార్టీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పార్టీలో రేణూదేశాయ్, సుమ, పలువురు అతిథులు సందడి చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. ఇక వచ్చే నెల 9న వీరి పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. పెళ్లి డేటుని తానే స్వయంగా చెబుతానని సునీత ఓ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.