సంపాదనలో కోహ్లీ కంటే బుమ్రా టాప్
టీమిండియా ఆటగాళ్లలో ఈ సంవత్సరం అందరి కన్నా ఎక్కువ సంపాదించింది పేసర్ జస్ప్రీత్ బుమ్రా అట. కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ పారితోషికం సంపాదించాడు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో కోహ్లీ, బుమ్రా, రోహిత్ శర్మ.. A+ కేటగిరీలో ఉన్నారు. ఈ ముగ్గురూ ఏడాదికి రూ.7 కోట్ల చొప్పున అందుకుంటారు. ఇది కాకుండా బీసీసీఐ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు కూడా చెల్లిస్తుంది.
ఒక్క టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20లకు 3లక్షల చొప్పున పారితోషికం అందజేస్తుంది. ఈ నేపథ్యంలో బుమ్రా 2020లో అందరికన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడి ఎక్కువ ఆదాయం పొందాడు. మొత్తం 4 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఆడిన టీమ్ఇండియా పేసర్ ఈ ఏడాది మ్యాచ్ ఫీజుల రూపంలో రూ.1.38 కోట్లు తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఆ తర్వాతి స్థానంలో కోహ్లీ (రూ.1.44 కోట్లు), రవీంద్ర జడేజా (రూ.96 లక్షలు) ఉన్నారు.