బంపర్ ఆఫర్ : జంటగా అవినాష్-అరియానా

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ పంటపడుతోంది. బంపర్ ఆఫర్లు వస్తున్నాయ్. ఇప్పటికే బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు వరుస ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. సోహైల్ హీరోగా సినిమా ఫిక్సయింది. అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో మెరవడానికి మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం ఓకే చెప్పేశారు. ఈ సినిమా క్లిక్ అయితే సోహెల్ హీరోగా సెటిలైనట్టే.

ఇక బిగ్ బాస్ ఇంట్లో జంటగా ఆకట్టుకున్న అరియానా-అవినాష్ (అవియానా)లకు బంపర్ ఆఫర్ వచ్చిపడినట్టు తెలుస్తోంది. వీరుద్దరు జంటగా ఓ టీవీషోని ప్లాన్ చేస్తున్నారట. హోస్ట్‌గా అరియానాకు మంచి అనుభవం ఉంది. అలాగే అవినాష్ కూడా శ్రీముఖితో క‌లిసి ఓ షోను హోస్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఈ ఇద్ద‌రితో క‌లిసి ప‌లు ఛానెళ్ల వాళ్లు షోలు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అరియానా, అవినాష్‌ టీవీ ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. అవి పూర్తయితే.. వీరిద్దరు జంటగా బుల్లితెరపై సందడి చేయనున్నారు.