తెలంగాణ భవన్ కు బాంబు బెదిరింపు!!
టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. బంజారాహిల్స్ లో ఉన్న కార్యాలయానికి బాంబు ఉందని బెదిరింపు కాల్ రావడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. భవన్ మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు డిటెక్ట్ కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అధికార పార్టీ కార్యాలయానికి బెదిరింపు కాల్ చేసింది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడిన ఆ వ్యక్తి ఆదిలాబాద్ వాసిగా గుర్తించారు.పూర్తి దర్యాప్తు తరువాత మరిన్ని విషయాలు తెలుస్తాయి.