విజయ్ దేవరకొండ జిమ్ వీడియో చూశారా ?
‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక ‘అర్జున్ రెడ్ది’తో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాడు. క్రేజీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనతో అభిమానులకి షాక్ ఇస్తూ.. దూసుకెళ్తున్నాడు.
ప్రస్తుతం విజయ్ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. అనన్య పాండే హీరోయిన్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. తాజాగా విజయ్ ఫిట్నెస్ మరింత పెంచుకొనే పనిలోఉన్నారు. ఇందులో భాగంగా జిమ్ లో కసరత్తు చేస్తున్నారు. తాజాగా దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడీ.. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Beast Mode ON!#VD10 pic.twitter.com/vcf8viyEDH
— Vijay Deverakonda (@TheDeverakonda) December 27, 2020