కరోనా ఫ్రీ తెలంగాణ.. ఎప్పటిలోగా ? 

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయ్. తెలంగాణలో కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 205 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయ్. ప్రస్తుతం రాష్ట్రంలో 6,231 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో నెలరోజుల్లో కరోనా ఫ్రీ తెలంగాణను చూడొచ్చు. కానీ బ్రిటన్ లో వెలుగులోకి కొత్త వైరస్ భయపెడుతోంది. ఇటీవల బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్ గా  నిర్థారణ అయింది. వీరికి సోకింది కొత్త రకం వైరస్ అయితే డెంజర్ అనే చెప్పాలి. లేదంటే కరోనా నుంచి తెలంగాణ బచాయించినట్టే. వాక్సిన్ కూడా వస్తోంది కాబట్టి.. అతి త్వరలోనే కరోనా ఫ్రీ తెలంగాణని చూడొచ్చు.

ఇక తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,068కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోవడంతో.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,533కి పెరిగింది. తాజాగా 551 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ రికవరీ అయిన వారి సంఖ్య 2,77,304కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,231 క్రియాశీల కేసులు ఉన్నాయి. వీరిలో హోం ఐసోలేషన్‌లో 4,136 మంది ఉన్నారు.