మెహబూబ్ కు మెగా ఆఫర్ 

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ పండపండుతోంది. వారికి సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇక సోహెల్ ఇప్పటికే తొలి సినిమాకు సంతకం చేశాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సోహెల్ సినిమాని ప్రమోట్ చేస్తానని మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. సోహెల్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించేందుకు కూడా ఓకే చెప్పేశారు. బిగ్ బాస్ వేదికపై మెగాస్టార్ హామీ ఇచ్చినవే కాదు.. ఇవ్వనివి కూడా చేస్తున్నారు.

ఆచార్యలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ కు అవకాశం ఇచ్చారు. కొరటాల శివకు మెగాస్టార్.. మెహబూబ్ పేరు ఒక పాత్రకోసం సూచించడం.. దానికి కొరటాల కూడా అంగీకరించడం జరిగిందట. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలె వేదికపై మెగాస్టార్.. మెహబూబ్ ని అభినందించిన సంగతి తెలిసిందే. మెహబూబ్ లో తనని తాను చూసుకున్నానని.. వయసులో ఉన్నప్పుడు తాను మెహబూబ్ లా కసిగా ఉండేవాడని చెప్పారు. మెహబూబ్ పై కేవలం అభినందనలు మాత్రమే.. అతడికి తన సినిమాలో ఆఫర్ కూడా  ఇవ్వడం గొప్పవిషయం.