రెహమాన్’కు మాతృవియోగం
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి కరీమా బేగం సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు మాతృమూర్తి మరణంతో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. రెహమాన్‌కి తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడు ఆయన తండ్రి మరణించగా.. కరీనా కష్టపడి రెహమాన్‌ని పెంచారు.
ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నప్పటికీ.. సంగీతంపై రెహమాన్‌కి ఉన్న శ్రద్ధను చూసి.. ఆ దిశగా అతడికి ప్రోత్సాహం అందించారు. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా తన తల్లిపై రెహమాన్ ప్రేమను చూపుతూ వచ్చారు. మాతృవియోగం కలిగిన రెహమాన్ కు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కరీమా బేగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పలువురు ప్రముఖులు రెహమాన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు.