గ్రేటర్ హామీ నెరవేర్చిన బీజేపీ

ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని భాజాపా నేరవేర్చింది. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపాని గెలిపిస్తే ఎల్ఆర్ఎస్ ని రద్దు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అదేలా సాధ్యం ? గ్రేటర్ లో భాజాపా గెలిచినా.. రాష్ట్రంలో మేం అధికారంలో ఉన్నాం. అలాంటప్పుడు ఎల్ఆర్ఎస్ ని తెలంగాణ భాజాపా ఎలా రద్దు చేస్తుంది ” ఏమైనా మతి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఎద్దేవా చేశారు.

కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ రద్దుని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీని భాజాపా నెరవేర్చినట్టయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తెరాస, మంత్రి కేటీఆర్ పై సటైర్స పడుతున్నాయ్. ఎల్ఆర్ఎస్ భాజాపా ఎలా రద్దు చేస్తుందని మంత్రి కేటీఆర్ అప్పుడు అన్నారుగా.. ? ఇలాగే అంటూ.. బండి సంజయ్ హామీ ఇచ్చిన వీడియో, దానికి కేటీఆర్ ఖండించిన వీడియోలతో సోషల్ మీడియాలో సెటర్స్ వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజాపా ఇచ్చిన హామీని తెరాస నెరవేర్చిందని కామెంట్స్ చేస్తున్నారు.