అజారుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో అజారుద్దీన్ బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి రాజస్థాన్‌కు బయలు దేరారు.
ఐతే రాజస్థాన్‌లోని సుర్వార్‌కు చేరుకోగానే ఆయన కారు అదుపు తప్పి పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి… పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్ కి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ధాబాలో పనిచేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక అజారుద్దీన్ కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. అజారుద్దీన్ విషయంలోనూ భయపడాల్సిన పనిలేదు. ఆయనకి స్వల్ప గాయాలయ్యాయని చెబుతున్నారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఒంటిపై రక్తపు మరకలని చూస్తే తీవ్ర గాయాలు అయినట్టు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలుస్తోంది.