మంత్రి కొప్పుల పర్యటన.. భాజాపా-తెరాస నేతలు తన్నుకున్నారు !
తెలంగాణలో ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. భాజాపా బలపడింది. తెరాసని గట్టిగా ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత ఉన్నవాటి విషయంలో ముందుకు వెళ్లడం లేదు. అందుకే ఎల్ఆర్ఎస్ రద్దు చేశారు. నిర్భంధ వ్యవసాయంపై యూటర్న్ తీసుకున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులని ఖుషి చేస్తున్నారు. ఉద్యోగుల జీతాలు పెంచుతున్నారు. కొత్త ఉద్యోగ ప్రకటనలు వేస్తున్నారు.
మరోవైపు భాజాపా దూకుడు కొనసాగుతోంది. గ్రామాల్లోకి తెరాస నేతలు వస్తే భాజాపా నేతలు అడ్డుకుంటున్నారు. అభివృద్దిపై, ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నారు. మంత్రులు వచ్చిన వదిలిపెట్టడం లేదు. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటనలోనూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పర్యటనకి వెళ్లిన మంత్రి కొప్పులని బీజేపీ నేతలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భాజాపా-తెరాస నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇది కాస్త ఉద్రిక్తలకి దారి తీసింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి.. భాజాపా నేతలని అరెస్ట్ చేయడంతో పరిస్థితి చల్లబడింది.