రోహిత్ వచ్చేశాడు.. జట్టులో మార్పులేంటీ ?
చారిత్రాత్మక ఓటమి తర్వాత.. చారిత్రాత్మక విజయంతో టీమిండియా కమ్ బ్యాక్ అయింది. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ రసవత్తరంగా మారనుంది. ఓపెనర్ రోహిత్ శర్మ రాకతో భారత జట్టు మరింత పటిష్టం కానుంది. అయితే రోహిత్ కోసం ఎవరిని జట్టు నుంచి తప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారిలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి హిట్‌మ్యాన్‌కు స్థానం కల్పిస్తారనే వాదనలు వస్తున్నాయి. అంతేగాక ఆటకు చాలా రోజులు దూరమైన అతడు ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని అంటున్నారు. అయితే ఓపెనర్‌గా రోహిత్ వస్తే మయాంక్ బెంచ్‌కే పరిమితమవుతాడు. అరంగేట్రంలోనే శుభ్‌మన్ గిల్ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో అతడి స్థానం ఖరారైనట్లే. ఒకవేళ అయిదో స్థానంలో రోహిత్‌తో ఆడించాలనకుంటే విహారికి నిరాశ తప్పదని తెలుస్తోంది.