డించిక్ డించిక్.. అదిరిపోయింది !


కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్  నటించిన చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ కథానాయికలు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐటమ్ నెంబర్ ‘డించిక్ డించిక్ ఢింకా.. ‘ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో రామ్ కి జంటగా హెబ్బా పటేల్ చిందేసింది. ఎద అందాలతో కనువిందు చేసింది. సాంగ్ లో రామ్, హెబ్బా స్టెప్పులు అదిరిపోయాయ్. యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది ఈ సాంగ్.

ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. సాకేత్, కీర్తినా శర్మ కలిసి పాడారు. మణిశర్మ సంగీతం అందించారు. రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా సాంగ్ ఉంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ పవర్ ప్యాకెడ్ గా ఉంది.  రెండు పాత్రల్లో రామ్ అదరగొట్టాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ తెరకెక్కుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.