అవినాష్’కు స్టార్ డైరెక్టర్ హామీ

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ పంట పండుతోంది. వారు బంపర్ ఆఫర్లు అందుకుంటున్నారు. బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయనకు ‘ఎఫ్3’ అవకాశం దక్కింది. అనిల్ రావిపూడి ఆయన కోసం మంచి పాత్రని ఇచ్చారని చెప్పుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక సోహెల్ ఇప్పటికే తొలి సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ లభించనుంది. అంతేకాదు.. గెస్ట్ రోల్ లో మెరిసే ఛాన్స్ ఉంది. కామెడీ బ్రహ్మా బ్రహ్మానందం కూడా గెస్ట్ రోల్ లో మెరవనున్నాడు. ఇక రిస్క్ చేసి.. మరీ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన జబర్థస్త్ అవినాష్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయ్. అరియానాతో కలిసి అవినాష్ ఓ టీవీ కార్యక్రమం చేయబోతున్నాడు.

అంతేకాదు.. స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి అవినాష్ కి హామీ లభించిందట. తన తదుపరి సినిమాలో అవినాశ్ కు మంచి పాత్ర ఇస్తానని అనిల్ హామీ ఇచ్చారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమాలో అవినాష్ కి పాత్ర దక్కనుంది అన్నమాట. ఈలోపు అరియానా జోడిగా అవినాష్ బుల్లితెర ప్రేక్షకులని మురిపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.