రైతుల డిమాండ్.. ఆ రెండింటికి కేంద్రం ఓకే !


రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు ముగిశాయి. తాజా భేటీ దాదాపు 5గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో రైతులు చేసిన రెండు విజ్ఝప్తులకి కేంద్రం ఓకే చెప్పింది. ఇందులో ఒకటి ఎంఎస్‌పీపై కమిటీ వేసేందుకు కేంద్రం ఒప్పుకుంది. అలాగే విద్యుత్ బిల్లులను పెండింగ్‌లో పెట్టేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఇక జనవరి 4న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

మరోవైపు మిగతా అంశాలని కూడా పరిగణనలోకి తీసుకుంటామని.. రైతులు ముందుగా తమ ఆందోళనను విరమించాలని కేంద్రం కోరింది. అయితే 3 వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రతిష్టంభన కొసాగుతోంది. ఆ చట్టాలని రద్దు చేసేది లేదనే కేంద్రం స్పష్టం చేస్తోంది. మరోవైపు వాటి రద్దుకు రైతులు పట్టుబడుతున్నారు. ఇక ఇప్పటి వరకు కేంద్రం రైతులతో ఆరుసార్లు చర్చలు జరిపింది. వీటిలో తాజా భేటీలోనే సానుకూలంగా ఫలితాలొచ్చాయ్. జనవరి 4న ఏడోసారి కేంద్రం రైతులతో చర్చలు జరపనుంది.బహుశా.. ఈ భేటీలోనైనా.. కేంద్రం రైతులని సంతృప్తి పరుస్తుందేమో చూడాలి.