అందాల స్వర్గంలోకి తీసుకెళ్తోంది 


మలైకా అరోరా – ఫర్ ఫెక్ట్ ఫిగర్. వయసు పెరిగినా.. వన్నె తగ్గని అందం ఆమె సొంతం. ఈ వయసులోనూ యంగ్ హీరోయిన్స్ కుళ్లుకునేలా ఫోటో షూట్స్ చూస్తుంటుంది. ఇటీవల మలైకా ఇచ్చిన ఓ పోజు సోషల్ మీడియాని షేక్ చేసింది. ఆ హీట్ చల్లారకముందే.. మరో ఫోటో షూట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ బ్యూటీ.

‘ఉష్ణమండల స్వర్గం’ అంటూ ఆ పోస్టులో రాసుకొచ్చింది. అందులో ఆమె ధరించిన ఆకుపచ్చ దుస్తుల గురించి జోరుగా చర్చ సాగుతోంది. ‘గ్రీన్‌ క్యాబేజీ’ అంటూ ఒకరు స్పందించగా.. కాదుకాదు.. ‘గోబీ డ్రెస్‌’ అంటూ మరొకరు స్పందిస్తున్నారు.

మలైకా టాలీవుడ్‌లోనూ కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌కు చిందేసింది. గబ్బర్‌సింగ్‌లో ‘కెవ్వుకేక’, అతిథి సినిమాలో ‘రాత్రయినా నాకూ ఓకే.. పగలైతే డబలోకే’ అంటూ తెలుగు ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. బాలీవుడ్‌లో ఓం శాంతి ఓం, హౌస్‌ఫుల్‌, దబాంగ్‌ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం ఆమె బుల్లితెరకే పరిమితమైంది. కాగా.. తన ప్రియుడు అర్జున్‌కపూర్‌తో కలిసి నూతన సంవత్సర వేడుకల కోసం మలైకా గోవాకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.