అల్లుడితో మోనాల్ పని పూర్తయింది !

బిగ్ బాస్ తో హీరోయిన్ మోనాల్ గజ్జర్ పేరు మారుమ్రోగిపోయింది. ఇంట్లో ఆమె చేసిన రొమాన్స్ హైలైట్. ఒక్కరితో కాదు.. ఇద్దరితోనూ కథ నడిపింది. బిగ్ బాస్ ఎండింగ్ కి వచ్చేసరికి మాత్రం మోనాల్ అఖిల్ పిల్ల అనిపించుకుంది. ఇక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటికొచ్చిన మోనాల్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అయితే అవి హీరోయిన్ ఆఫర్స్ కాదని తెలుస్తోంది. కొన్ని కీలక పాత్రలు, మరికొని ఐటమ్ ఆఫర్లు ఉన్నాయట. ఆమె ఐతమ్ గా మారేందుకు ఒప్పేసుకుంది. అల్లుడు అదుర్స్ లో చిందేసింది.

సంతోష్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటిస్తున్న చిత్రమిది.నభానటేశ్, అను ఇమాన్యుయెల్ కథానాయికలు. సోనూసూద్, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఆఖరి షెడ్యూల్ లో మోనాల్ పై ఐటమ్ సాంగ్ ని చిత్రీకరించారు. ప్యాకప్ డే రోజున చిత్రబృందం మీడియాతో మాట్లాడింది. అల్లుడు అదుర్స్ లో వినోదం అదుర్స్ అని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు.