పాయల్.. స్కూల్ డేస్ నుంచే అతడితో.. !!
సినిమా, క్రికెట్ స్టార్స్ ప్రేమ, పెళ్లి విషయంలో.. ఓ కామన్ పాయింట్ కనబడుతుంటుంది. చిన్ననాటి స్నేహితుడు/స్నేహితురాలితో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వరకు వారు చిన్న నాటి స్నేహితులని తెలియదు. వారి మధ్య ఎప్పటి నుంచో లవ్ ట్రాక్ నడుస్తుందని తెలీదు. పెళ్లికి, తర్వాత మాత్రమే ఈ సీక్రెట్ ని విప్పుతారు. ఇటీవల పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ ఇదే చేసింది. గౌతమ్ కిచ్లూ చిన్ననాటి స్నేహితుడు. చిన్ననాటి మా స్నేహం ప్రేమగా మారిందని చెప్పి ఆశ్చర్యపరిచింది.
ఇక హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ విషయానికొస్తే.. పెళ్లి గురించి పక్కనపెట్టేసి చిన్ననాటి స్నేహితుడితో ఎంజాయ్ చేసేస్తోంది. బాయ్ ఫ్రెండ్ సౌరబ్ థింగ్రాతో ఉన్న ఫొటోలని పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. అలాగని ప్రేమలో ఉన్నామని చెప్పదు. పాయల్ రాజ్ పుత్ ఢిల్లీలో చదువుకునే రోజుల్లో క్లాస్ మేట్ సౌరబ్ థింగ్రా తో స్నేహం చేసింది.
ఒకే స్కూల్లో.. ఒకే క్లాస్ అయినా ఆ ఇద్దరి బ్యాచ్ లు వేరట. అయితే పలుమార్లు జాలీగా గడిపారట. ఓపెన్ గా చెప్పాలంటే స్కూల్ ఏజ్ నుంచే వీరు ప్రేమలో ఉన్నారు. అన్నీ అనుభవిస్తున్నారట. న్యూ ఇయర్ నేపథ్యంలో ఈ జంట సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. ప్రియుడితో దిగిన హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.