జట్టులో చేరిన రోహిత్’పై జోకులే జోకులు !

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత జట్టుతో కలిసిపోయాడు. మెల్‌బోర్న్‌ హోటల్‌ రూంలో టీమిండియా రోహిత్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పింది. మెల్‌బోర్న్‌లోని హోటల్‌ రూంలో వచ్చిన హిట్‌మ్యాన్‌కు రహానే ఘనస్వాగతం పలికాడు. రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, చెతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు రోహిత్‌ను అప్యాయంగా హత్తుకుని స్వాగతం పలికారు. హిట్ మ్యాన్ కు ఆహ్వానాలే కాదు. సటైర్లు పడ్డాయి.

టీమిండియా చిఫ్ కోచ్ రవిశాస్త్రి.. రోహిత్ నాజూగ్గా కనిపిస్తున్నాడు అంటూ ఛలోక్తి విసిరాడు. “నీ క్వారంటైన్‌ రోజుల ఎలా గడిచాయి యవ్వనంగా కనిపిస్తున్నావు” అంటూ రోహిత్‌తో సరాదగా సంబాషించాడు. దీనికి సంబందించినవీడియోను బీసీసీఐ తన ట్విటర్లో షేర్‌ చేసింది. ఇక రోహిత్ రాకతో టీమిండియా మరింత పటిష్టంగా మారనుంది. రోహిత్ రావడంతో జట్టులో మార్పులు చేయనున్నారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ హనుమ విహారిలో ఒకరిపై వేటు పడనుంది.