రహానేకు అరుదైన గౌరవం.. ఇది రెండోసారి !


టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానె అరుదైన గౌరవం లభించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్ (ఎంసీజీ) ప్రతిష్ఠాత్మకంగా గౌరవించే బోర్డులో రెండోసారి తన పేరును నమోదు చేసుకున్నాడు. టీమ్‌ఇండియా ఈ విషయాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది.

2014 బాక్సింగ్‌ డే టెస్టులో రహానె(147) తొలిసారి ఇదే మైదానంలో శతకంతో కదం తొక్కాడు. అప్పుడు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. తాజా సిరీస్‌లో రెండోసారి శతకం బాది క్లిష్ట సమయంలో భారత్‌ను గెలిపించాడు. దీంతో ఎంసీజీ నిర్వాహకులు రహానె పేరును రెండోసారి గౌరవ సూచికంగా ఆ బోర్డుపై లిఖించారు. ఆ వీడియోను టీమ్‌ఇండియా అభిమానులతో పంచుకుంది. ఇక ఇప్పటి వరకు జరిగిన రెండో టెస్టులో 1-1తో భారత్-ఆసీస్ సమంగా నిలిచాయి. జనవరి 7 నుంచి మూడో టెస్ట్ జరగనుంది.