రాజధానిలో రెండ్రోజుల పాటు కర్ఫ్యూ
కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండ్రోజుల పాటు రాత్రివేళల్లో కర్ఫ్యూ విధించింది. డిసెంబర్ 31, రాత్రి, జనవరి 1 తేదీల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
బ్రిటన్ కొత్త స్ట్రైయిన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రాత్రి కర్ఫ్యూ సమయంలో ఎవరూ కూడా కొత్త సంవత్సరం వేడుకలను ఇళ్ల బయట జరుపుకోకూడదని, బహిరంగ స్థలాల్లో గుంపులుగా ఉండటం, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా కర్ఫ్యూ సమయంలో బయటకు వస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలని బ్యాన్ చేయలేదు. పైగా అదనపు అనుమతులు ఇచ్చింది. ఈరోజు రాత్రి 12గంటల వరకు మద్యం షాపులకు, రాత్రి 1గంటల వరకు బార్లు, క్లబ్ లకి అనుమతులు ఇచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్ ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది.