బాలీవుడ్ లోకి సందీప్ కిషన్ సినిమా

దక్షిణాది హిట్ సినిమాలు బాలీవుడ్ లోకి రిమేక్ అవ్వడం.. అక్కడ హిట్ అవ్వడం చూస్తున్నాం. మన అర్జున్ రెడ్డి, పోకిరి… బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించాయి. ఈ క్రమంలో యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమా కూడా బాలీవుడ్ లో రిమేక్ కాబోతోంది. లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మా నగరం’ సినిమా కూడా ఉంది. తెలుగులో ‘నగరం’ పేరుతో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

ఇందులో టాలీవుడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఇద్దరి హీరోల్లో ఓ హీరోగా మెప్పించిన సంగతి తెలిసిందే. సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ దర్శకుడిగా మారి ‘మా నగరం’ బాలీవుడ్‌ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ బాలీవుడ్‌ రీమేక్‌లో సందీప్‌ కిషన్‌ పాత్రను కోలీవుడ్ స్టార్ విజయ్‌ సేతుపతి పోషిస్తున్నాడట. ఈ ఏడాది ప్రథమార్థంలో సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే విజయ్ సేతుపతి ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ లో నటిస్తోన్న సంగతి తెలిసింది. దీంతో పాటు షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌లోనూ విజయ్‌ సేతుపతి నటించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో నగరం రిమేక్ తో బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించడానికి రెడీ అవుతున్నారు.