షాకింగ్ : సౌరభ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. ఆసుపత్రిలో చేరిక

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. గుండెనొప్పితో హాస్పటల్ లో చేరారు. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతీనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో చేర్చారు. ఇవాళ సాయంత్రం యాంజియోప్లాస్టీ సర్జరీ చేస్తారని తెలుస్తోంది.

గంగూలీకి ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే భారత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. భారత క్రికెట్ స్థితి, గతి మారడంలో గంగూలీకి కీలక పాత్ర. ఆయన సారధ్యంలోని భారతజట్టు ఎన్నో అద్భుతమైన విజయాలని నమోదు చేసింది. గంగూలీ కెప్టెన్సీగా యువకులకి పెద్దపీఠ వేశారు.