గుడ్ చెప్పిన కేంద్రం.. ఉచితంగా కరోనా వాక్సిన్ !
కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ ని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. శనివారం దేశ వ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రైరన్ మొదలైంది. రాష్ట్రాలన్నింటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా కరోనా వాక్సీన్ ఉంచితంగా పంపిణీ చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష్ ‘ఇది కేవలం ఢిల్లీలోనే కాదు.. దేశమంతా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తాం’ అని ప్రకటించారు. ‘ఉచిత కరోనా వాక్సిన్’ అన్నది బీజేపీ ఎన్నికల హామీగా వాడుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీహార్ ప్రజలకి హామీ ఇచ్చింది. ఇప్పుడు బీహార్ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందజేయనుంది.
ఇక ఢిల్లీలో ముందుగా తొలి దశలో 51లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ డిసెంబర్ 24న తెలిపారు.హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 50ఏళ్లు పైబడ్డ వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో విడతలో మిగితా వారికి వాక్సిన్ ఇస్తామని తెలిపారు.