యూకే రిటర్న్స్ కోసం కొత్త గైడ్ లైన్స్
బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రయిన్ వెలుగులోనికి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. బ్రిటన్ నుంచి వచ్చే విమాన సర్వీసులని పలు దేశాలు రద్దు చేశాయి. భారత్ కూడా జనవరి 7వరకు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 8 నుంచి 23 వరకు మళ్లీ విమాన సర్వీసులని నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో యూకే రిటర్న్స్ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధనలని విడుదల చేసింది. * యూకే నుంచి బయల్దేరే 72 గంటల ముందు నిర్వహించిన కోవిడ్ టెస్ట్‌లో నెగెటివ్‌గా తేలిన రిపోర్టు ఉండాల్సిందే.
* సదరు ప్రయాణికుడిని విమానంలోకి ప్రవేశించేముందు విమానయాన సంస్థలు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్‌ను పరిశీలించాలి.
* ఆర్టీపీసీఆర్ టెస్ట్ లేక, టెస్ట్ జరిగిన తర్వాత ఫలితం కోసం చూసేవారికోసం విమానాశ్రయంలో షెల్టర్ కల్పించాలి.
* సదరు ప్రయాణికుడికి కోవిడ్ పాజిటివ్‌గా తేలితే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండే విధంగా చూడాలి. నెగెటివ్‌గా తేలేవరకూ ఐసోలేషన్‌లో ఉండాల్సిందే.
* కోవిడ్ పాజిటివ్‌గా తేలిన వ్యక్తితో ప్రయాణించిన.. అటూఇటూ మూడు వరసల్లో ఉన్న ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి.
* ఎయిర్‌పోర్ట్‌లో నెగెటివ్‌గా తేలిన వ్యక్తి అధికారుల పర్యవేక్షణలో 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే