గ‌జ్వేల్ లో అస‌లు కేసీఆర్ గెలుస్తాడా? : జీవ‌న్ రెడ్డి

ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత జీవ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. సొంత స‌ర్వేల్లో ఎన్ని సీట్లైనా రావొచ్చ‌ని, టీఆర్ఎస్ కు 106 కాక‌పోతే 112 వ‌స్తాయ‌ని చెప్పుకోమంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. అస‌లు గ‌జ్వెల్ లో కేసీఆర్ గెలుస్తాడా అంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి కాంగ్రెస్ లోకి వ‌స్తాడ‌న్న ప్ర‌చారంతోనే కేసీఆర్ త‌న ప్లేస్ మార్చుకుంటున్నార‌ని విమ‌ర్శించారు.

బీజేపీకి తెలంగాణ‌లో స్థానం లేద‌న్న మాట వాస్త‌వ‌మేన‌ని, మోడీ మిత్రుడైతే తెలంగాణ‌కు అన్యాయం ఎందుకు జ‌రుగుతోందో కేసీఆర్ చెప్పార‌ల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీకి హోదా ఇవ్వాల‌ని కాంగ్రెస్ అంటే త‌ప్పు.. మీరంటే ఒప్పా అని విమ‌ర్శించారాయ‌న‌. తెలంగాణ అంటే కేవ‌లం టీఆర్ఎస్ మాత్ర‌మే కాద‌ని, రాష్ట్రన్ని టీఆర్ఎస్ క‌బంధ హ‌స్తాల నుంచి కాపాడ‌తామ‌ని జీవ‌న్ రెడ్డి అన్నారు.