గుడ్ న్యూస్ : రోహిత్’తో పాటు 5గురికి కరోనా నెగటివ్
రోహిత్‌శర్మతో సహా ఐదుగురు క్రికెటర్లు బయట రెస్టారెంట్లో భోజనం చేశారని.. వారిని ఐసొలేషన్‌లో పెట్టడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులందరికీ నిన్న కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆటగాళ్లందరికీ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. జట్టు సహాయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించామని వారికి కూడా నెగెటివ్‌గా తేలినట్లు తెలిపింది.
ఇక ఈ నెల 7 నుంచి సిడ్నీలో ఆస్ర్టేలియా- భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టుని ఆసీస్ గెలుచుకోగా.. రెండో టెస్టులో భారత్ గెలుపుపొందింది. ఈ నేపథ్యంలో మూడో టెస్ట్ రసవత్తంగా మారనుంది. ఓపెనర్ రోహిత్ శర్మ జట్టులో చేరడంతో టీమిండియా మరింత బలపడినట్టు కనిపిస్తోంది. ఇక గాయపడిన ఉమేష్ యాదవ్ స్థానంలో.. యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ ని జట్టులోకి తీసుకున్నారు. అతడిని తుది జట్టులోకి కూడా తీసుకోనున్నారని తెలుస్తోంది.