డేంజర్ : దేశంలో 38కి చేరిన కరోనా కొత్త కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చిందని ఆనందించే లోపే కొత్త రకం వైరస్ దేశంలోకి ప్రవేశించింది. రోజురోజూకి కొత్తరకం కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా మరో 9 మందిలో బ్రిటన్ స్ట్రైయిన్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 38కి చేరింది.
ఢిల్లీలోని ఐజీఐబీలో 11, ఢిల్లీలోని ఎన్‌సీడీసీలో 8, బెంగళూరులోని ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో 10, పూణేలోని ఎన్‌ఐవీలో 5, హైదరాబాద్‌లోని సీసీఎంబీలో 3, కోల్‌కతాలోని ఎన్సీబీజీలో ఒకటి చొప్పున కొత్త రకం కరోనా వైరస్‌ను నిర్ధారించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక బ్రిటన్ లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే విమాన సర్వీసులని భారత్ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 8 నుంచి వాటిని పునరుద్దరించనుంది.