ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రేషన్ డోర్ డెలవరి

రేషన్ సరుకులని ఇంటి వద్దకే సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకులని ఇంటివద్దనే అందించాలని నిర్ణయించింది.

ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇంటి వద్దకే రేషన్ సరఫరా కోసం ప్రభుత్వం 9,260 వాహనాలను సిద్ధం చేసింది. వాటిలో తూకం యంత్రాలు కూడా ఉంటాయి. ధాన్యం సేకరించిన అనంతరం 15 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని సీఎం జగన్ అధికారులని ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఏవైనా బకాయిలు ఉంటే సంక్రాంతి నాటికి చెల్లించాలని సూచించారు.