ఆయన జనసేనను విలీనం చేయమన్నారు: పవన్
చాలారోజుల తరువాత బీజేపీ, జనసేనానికి మధ్య జరిగిన సంభాషణలేమిటో చెప్పారు జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన మద్దతు తెలిపారు. జాతీయ పార్టీలు సక్రమంగా పనిచేస్తే ప్రాతీంయ పార్టీలు పుట్టవని ఆయన అన్నారు. టీడీపీ , టీఆర్ఎస్ , జనసేనలు ఈవిధంగానే పుట్టాయని చెప్పారు.
మాటల సందర్భంలో భవిష్యత్ జాతీయ పార్టీలదేనని చెబుతూ.. జనసేనను బీజపీ లో కలపమని అమిత్ షా తనను అడిగారని ఆయన చెప్పారు. రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయం అవసరమని జనసేన నమ్ముతోందన్నారు పవన్.
మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ కు తెలుగువాడిగా తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.
కేసీఆర్ కు ఆ సమర్థత ఉందని, తెలంగాణ ఉద్యమాన్ని నిబద్దతతో .. ఒక రక్తపు బొట్టు కూడా చిందకుండా నడిపిన వ్యక్తి కేసీఆర్ అని ఆకాశానికెత్తారు. దేశ పరిస్థితులపై కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని, 2019లో ప్రాంతీయ పార్టీల ప్రమేయం లేకుండా రాజకీయాలుండవని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.