26న ఆర్ఆర్ఆర్ మెగా ప్రోమో
ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే 2 టీజర్లు వచ్చాయి. ముందుగా రామ్ చరణ్ టీజర్ వచ్చింది. దానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీజర్ వచ్చింది. దానికి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ఆర్ఆర్ యూనిట్ ఓ స్పెషల్ ప్రోమో రెడీ చేస్తోంది. ఈ టీజర్ కు చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తారనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది. దీనిపై చిత్రబృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
గతంలో రాజమౌళి తీసిన బాహుబలి-2 సినిమా టైమ్ లో కూడా చిరంజీవి పేరు తెరపైకి వచ్చింది. బాహుబలి-2 చిరంజీవి వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుందంటూ అప్పట్లో పుకార్లు వచ్చాయి. వాటిని జక్కన్న వెంటనే ఖండించాడు. అయితే ఈ సారి ఆర్ ఆర్ ఆర్ కోసం చిరు వాయిస్ ఓవర్ వార్తలని ఆయన ఖండించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంలో నిజముందేమోనని అభిమానులు నమ్ముతున్నారు. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఉన్నాడు.. కాబట్టి మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వొచ్చని చెప్పుకుంటున్నారు. మరీ.. ఇందులో నిజమెంత ? అన్నది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.