అల్లుడు అదుర్స్ ట్రైలర్ టాక్ – కామెడీ అదుర్స్

బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే యాక్షన్ లో మెప్పించాడు. రాక్షసుడి లాంటి థిల్లర్ సినిమాతో తొలి హిట్ కొట్టాడు. అయితే ఈ సారి తనలోని కామెడీ యాంగిల్ ని బయటికి తీసినట్టున్నాడు. ఆయన తాజా చిత్రం ‘అల్లుడు అదుర్స్’. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ట్రైలర్ ని విడుదల చేశారు. జస్ట్ హీరో, హీరోయిన్, వారి ప్రేమను పరిచయం చేసేసి, స్ట్రయిట్’గా కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోయారు. మధ్యలో యాక్షన్ లోకి దిగిపోయారు. చివరలో మళ్లీ కామెడీ టచ్ చేశారు. హీరో, అతని స్నేహితుల బృందం కలిసి ఓ ఇంట్లో చేసిన హర్రర్ కామెడీ డ్రామాను బాగా ఎలివేట్ చేయాలనే ప్రయత్నం కనిపించింది.

మొత్తానికి.. కామెడీ+యాక్షన్ లోనూ అల్లుడు ఇరగదీయబోతున్నట్టు హింట్ ఇచ్చారు. ట్రైలర్ లో మాత్రం కామెడీ అదుర్స్ అని చెప్పవచ్చు. హీరోయిన్స్ నభా నటాషా, అను ఇమ్మాన్యూయేల్ ల గ్లామర్ షో, సోనూసూద్ విలనీజంలని ట్రైలర్ లో పెద్దగా టచ్ చేయలేదు. వాటిని నేరుగా సినిమాలో చూపించబోతున్నారు.