బ్రేకింగ్ : ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్
ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్ పేటలో వెలుగులోకి వచ్చిన ముగ్గురు వ్యక్తుల కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆమెని నార్త్ జోన్ మహిళా ఇన్ స్పెక్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలోని లోథా అపార్ట్మెంట్స్ సమీపంలో ఉన్న ఆమెను ఆమె వాహనంలోనే బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలుస్తోంది. హఫీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే కిడ్నాప్ అయిన ముగ్గురు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కు బంధువులు. హఫీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే ఈ కిడ్నాప్‌కు ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భూమా అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ఉన్న నాటి నుంచే ఈ భూ వివాదం కొనసాగుతోందని తెలుస్తోంది.