మూడో టెస్ట్ : భారత్, ఆసీస్ తుది జట్ల వివరాలు

సిడ్నీ వేదికగా రేపటి నుంచి భారత్-ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో చెరో మ్యాచ్ గెలిచి 1-1 సమవుజ్జీలుగా ఉన్నాయి. దీంతో మూడో టెస్టులో గెలుపొంది ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్లు బలమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయి. మూడో టెస్ట్ ఆడనున్న భారత్-ఆసీస్ జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్‌ : అజింక్య రహానె (కెప్టెన్‌), రోహిత్ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, నవదీప్ సైని

ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్‌, విల్‌ పకోస్కీ, మార్కస్ హారిస్‌, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్, లబుషేన్, ట్రేవిస్‌ హెడ్, హెన్రిక్స్‌, టిమ్‌ పైన్ (కెప్టెన్‌), కమిన్స్‌, గ్రీన్‌, సీన్ అబాట్‌, లైయన్‌, స్టార్క్‌, స్వెప్సన్‌, హేజిల్‌వుడ్‌, ప్యాటిన్సన్‌, మైకేల్‌ నెసర్‌