ఆ హీరోయిన్’కి క్రిమినల్ ఆలోచనలు


మాళవిక శర్మ – ‘నేల టికెట్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 2018లో ఈ సినిమా వచ్చింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత రామ్ ‘రెడ్’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులని పలకరించబోతుంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన మాళవిక పర్సనల్, సినిమా విషయానలని ప్రేక్షకులతో పంచుకుంది.

‘నేలటికెట్టు’ చిత్రంలో నటిస్తున్న టైమ్ లో లా కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే నా ఇంటెర్న్‌షిప్‌ కూడ పూర్తిచేశాను. ఆ సమయంలోనే నిర్మాత రవికిషోర్‌, దర్శకులు కిషోర్‌ తిరుమల నన్ను కలిసి స్క్రిప్ట్‌ వినిపించారు. కథ వినగానే నా పాత్ర నచ్చి ఓకే చెప్పేశాను. అయినప్పటికి వాళ్లు పాత్రకు తగ్గట్టు ఆడిషన్‌ తీసుకుని ఎంపిక చేశారు. అటు లాయర్‌ వృత్తిని, ఇటు నటనపై ఉన్న ఆసక్తిని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తా.  భవిష్యత్తులో కచ్చితంగా క్రిమినల్‌ లాయర్‌ అవుతా’నంటూ చెప్పుకొచ్చింది. సంక్రాంతి కానుకగా రెడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.