ఇలా వదిలేస్తే ఎలా పంత్ ?

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేతికొచ్చిన రెండు క్యాచీలని జారవిడిచారు. విమర్శకుల నోటీకి పని చెప్పారు. అశ్విన్ బౌలింగ్ లో ఆసీస్ ఓపెనర్ విల్‌ పకోస్కీ ఇచ్చిన క్యాచ్ ని అందుకోవడంలో పంత్ విఫలమయ్యాడు. ఇక సిరాజ్ బౌలింగ్  విల్‌ పకోస్కీ ఇచ్చిన మరో క్యాచ్ ని కూడా పంత్ అందుకోలేకపోయాడు.

సాహా, సంజూ శాంసన్.. తదితరులని కాదని పంత్ కి అవకాశాలు ఇస్తున్నారు. అయితే పంత్ మాత్రం ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. అనవసరమైన షాట్ లకి వెళ్లి వికెట్ సమర్పించుకోవడం అతడికి అలవాటుగా మారింది. వికెట్ కీపింగ్ లోనూ తప్పిదాలు చేస్తున్నారు. తాజాగా జరుగుతున్న ఆసీస్ తో మూడో టెస్టులని రెండు క్యాచ్ లని మిస్ చేశాడు.

మూడో టెస్ట్ లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకొని తిరిగి మూడో టెస్టు ఆడుతున్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(5)ను పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ బోల్తాకొట్టించాడు. 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ ని విల్‌ పకోస్కీ(54)తో కలిసి మార్నస్‌ లబుషేన్‌(34) ఆదుకున్నారు. ప్రస్తుతం ఆసీస్ 93/1తో ఆటని కొనసాగిస్తోంది.