హాస్పటల్ నుంచి గంగూలీ డిశ్చార్జ్ (వీడియో)
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్వల్పగుండెపోటుతో హాస్పటల్ లో చేరిన సంగతి తెలిసిందే. కోల్ కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా గంగూలీ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా దాదా మీడియాతో మాట్లాడారు. ‘తన పరిస్థితి పూర్తిగా బాగుంది. వైద్యులకు, ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నా’నన్నారు.
వాస్తవానికి బుధవారమే గంగూలీ డిశ్చార్జ్ కావాల్సివుంది. కానీ ఇంకో హాస్పటల్ లోనే ఉంటానని గంగూలీ అనడంతో ఈరోజుకి వాయిదా వేశారు. ఇక దాదాకి యాంజియోప్లాస్టీ చేసిన సంగతి తెలిసిందే. గంగూలీ గుండె రక్తనాళాల్లో మూడు పూడికలను గుర్తించిన వైద్యులు వాటిలో ఒకదాన్ని తొలగించడం కోసం స్టెంట్ వేశారు. తొమ్మిది మంది సభ్యుల సీనియర్ వైద్యుల బృందం దాదాకు చికిత్స అందించారు.
#WATCH | "I thank the doctors at the hospital for the treatment. I am absolutely fine," says BCCI President Sourav Ganguly after being discharged from Kolkata's Woodlands Hospital. pic.twitter.com/BUwsz5h1FQ
— ANI (@ANI) January 7, 2021