ఏపీలో రాష్ట్రపతి పాలన ?


ఏపీలో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 140 దేవాలయాలకుపైగా దాడులు జరిగాయి. ఇవి ఎవరు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ?? అన్నది మాత్రం థ్రిల్లర్ సినిమాని తలపిస్తున్నాయ్. దీని వెనక ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఉందనే ప్రచారం మాత్రం బలంగా ఉంది. అది తెదేపానే అని వైకాపా ఆరోపిస్తోంది. దొంగలని పట్టుకోలేక తమపై ఆరోపణలు యేలా ? అంటూ తేదేపా అంటోంది. ఇక ఈ దాడులకి వ్యతిరేకంగా భాజాపా, జనసేనలు ఆందోళనలు చేస్తున్నాయి.


మొత్తానికి.. ఈ దాడుల వెనక ప్రధాన కారణం ఏపీలో వైసీపీప్రభుత్వాన్ని బలహీన పర్చాలి. అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొట్టాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెదేపా నేతలు ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలనే కొత్త డిమాండ్ ని తెరపైకి తెచ్చారు. ఈరోజు తెదేపా నేతలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌, తెనాలి శ్రవణ్ కుమార్, వర్ల రామయ్య, బుద్దా వెంకన్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ని కలిశారు. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటివి 144 ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అన్నింటిపైనా సీబీఐ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్ తో భేటీ అనంతరం తెదేపా నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్నిపాలించే అర్హత వైకాపా కోల్పోయిందని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని నేతలు డిమాండ్‌ చేశారు.