షాకింగ్ : కరోనాపై ప్రచారానికి కూడా అమితాబ్ పారితోషికం తీసుకున్నారట

కరోనా విజృంభిస్తున్న టైమ్ లో సెలబ్రిటీలు బాధ్యతగా వ్యవహరించారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమవంతు సాయం చేశారు. ఇందుకోసం ఉచితంగా ప్రచార చిత్రాలు చిత్రాలు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అయితే వీడియో సందేశాలతో పాటు, ప్రత్యేక ప్రచార చిత్రాలు కూడా చేశారు. కరోనా పట్ల ప్రజలని అలర్ట్ చేశారు. అయితే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ మాత్రం కరోనాపై ప్రచారానికి కూడా పారితోషికం తీసుకున్నారట. దీనిపై ఓ సామాజిక కార్యకర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

“కరోనాకాలంలో ఎంతో మంది సినిమా ప్రముఖులు తోచిన సాయం చేశారు. దేశసేవ చేసిన వాళ్లలో చాలామంది ఈ కాలర్‌ట్యూన్‌కు ఉచితంగా తమ మాటలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అమితాబ్‌ మాత్రం.. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కూడా పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడేమో ఆయన కుటుంబం కూడా కరోనా నుంచి బయటపడలేకపోయింది. అమితాబ్‌ ఒక సామాజిక కార్యకర్తగా దేశ సేవ చేయలేదు. ఆయనపై చాలా కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అమితాబ్‌ ఈ అవగాహన కార్యక్రమానికి అనర్హుడు’ అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.