మూడో టెస్ట్ : తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 338 (ఆలౌట్)

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌స్మిత్ ‌(131;226 బంతుల్లో16×4)సెంచరీతో రాణించాడు.
166/2 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో 172 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

లబుషేన్‌(91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో లబుషేన్.. రహానె చేతికి చిక్కాడు. ఆ తర్వాత నుంచి ఆస్ట్రేలియా వికెట్ల పతనం మొదలైంది. చివర్లో మిచెల్ స్టార్క్‌(24; 30 బంతుల్లో 2×4, 1×6) దాటిగా ఆడారు. టీమ్‌ఇండియా బౌలర్లలో జడేజా 4, బుమ్రా, సైని 2, సిరాజ్‌ 1 వికెట్‌ తీశాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్ ని దాటిగా మొదలెట్టింది. 6 ఓవర్లు పూర్తయ్యేసారికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. గిల్ 14, రోహిత్ శర్మ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.