ఉపాధ్యాయులని సీఎం కేసీఆర్ ఫుల్ ఖుషి చేస్తారా ?
తెలంగాణ ప్రభుత్వం ఓకేసారి నిరుద్యోగులు, ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీతో పాటు ఉద్యోగులకు ప్రమోషన్స్ ని కల్పించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల చివరిలోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు సైతం పదోన్నతులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులపై పీట ముడి ఇంకా వీడకపోవడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు పైబడిన పోస్టులకు సంబంధించిన పదోన్నతులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు అడ్డుగా మారాయి. దీంతో అలాంటి పదోన్నతులపై తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. మరీ.. ఉపాధ్యులని సీఎం కేసీఆర్ ఫుల్ ఖుషి చేస్తారేమో చూడాలి.