బీజేపీకి సరెండరైన కేటీఆర్ !?

సీఎం కేసీఆర్, ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ఇద్దరూ బీజేపీ సరెండర్ అయ్యారనే కామెంట్స్ వినిపిస్తున్నాయ్. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాజాపాపై తండ్రికొడుకులు కేసీఆర్, కేటీఆర్ కత్తులు దూసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీలో దుంకుత. జాతీయ స్థాయిలో భాజాపాయేతర పార్టీలని ఏకం చేస్తా. గత్తర లేపుతానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తీరా గ్రేటర్ ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి, కేంద్ర పెద్దలకు వంగి వంగి దండాలు పెట్టొచ్చారు.

అప్పటి వరకు కేంద్ర పథకాలని వ్యతిరేకించిన కేసీఆర్.. యూటర్న్ తీసుకున్నారు. కేంద్ర తీసుకొచ్చిన పథకాలు ఆణిముత్యాలు. అద్బుతాలు అంటూ వాటిని రాష్ట్రంలో అమలు చేయడం మొదలెట్టాడు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ భాజాపాపై విరుచుకుపడ్డారు. ఢిల్లీకి ఇచ్చేది రూపాయిన్నర.. తిరిగి మాకొచ్చేది ఆటనా. మిగితా రూపాయి ఎక్కడికిపోయింది అమిత్ షా అంటూ ప్రశ్నించాడు. ఎవడు ఎవరికిస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భాజాపాది ఉత్తమాటలే అంటూ ప్రచారం చేశారు. అయితే కేటీఆర్ మాటలు గ్రేటర్ ప్రజలు బుర్రకు ఎక్కించుకోలేదు. భాజాపాకు ఓటేశారు. దీంతో కేటీఆర్, కేసీఆర్ ల దిమ్మతిరిగింది. భాజాపాని ఢీకొనడం మనకే చేటు అనుకున్నట్టున్నారు.

మొన్న కేసీఆర్ ఢిల్లీలో భాజాపాకి సరెండరైపోయారు. తాజాగా హైదరాబాద్ లో కేటీఆర్ భాజాపాకు సరెండర్ అయిపోయారు. శనివారం గ్రేటర్ హైదరాబాద్ లో డబులు బెడ్ రూమ్ ఇళ్లు, పలు సంక్షేమ పథకాలని కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భాజాపా నేతల నుంచి నిరస ఎదురైంది. దీనిపైస్పందించిన కేటీఆర్.. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయపరంగా పోటీ పడదాం. మిగిలిన సమయంలో అభివృద్ధి కోసం పోటీ పడదామని, రాష్ట్ర అభ్యున్నతి కోసం కలిసి పని చేద్దాం. ఎన్నికల ముందు ఎవరు చేసిన పనిని వారు గొప్పగా చెప్పుకుందాం.  హుందాగా రాజకీయాలు చేద్దామన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలని విని ఆయన బీజేపీకి సలెండర్ అయిపోయారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కేటీఆర్ మాటలకు స్పష్టమైన అర్థం అది కాకపోయినా.. బీజేపీ విషయంలో కేటీఆర్ దూకుడు మాత్రం తగ్గిందన్నది సుస్పష్టం.