యాక్షన్ హీరోకు ఫిదా అవుతోందా ?

అందం+అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసింది సాయి పల్లవి. దీంతో తెలుగులో బిజీ అయిపోయింది. అయితే సాయి పల్లవి ఫిదా చేయడం మాత్రం ఈజీ కాదు. ఆమె స్టార్ హీరో అని ఓకే చెప్పదు. పారితోషికానికి పడిపోయింది. కావాల్సింది మంచి కథ. అందులో ఆమెది బలమైన పాత్ర. అప్పుడే సాయి పల్లవి ఓకే చెబుతోంది. స్టార్ హీరో.. భారీ బడ్జెట్.. హీరోయిన్ పాటలకే పరిమితం అంటే మాత్రం సాయి ఎస్ చెప్పదు. అలాంటి సాయి పల్లవి కోసం మాస్ హీరో గోపీచంద్ ట్రై చేస్తున్నారు.

మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, యూవీ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం ‘పక్కా కమర్షియల్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపిస్తారని సమాచారమ్. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆమెని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారట. మరీ.. ఆమె ఒప్పుకుంటుందా ? మాస్ హీరో గోపీచంద్ కు ఫిదా అవుతుందా ?? అన్నది చూడాలి.