వైరల్ : సింగర్ సునీత మెహందీ ఫంక్షన్ ఫోటోస్

సింగర్ సునీత మరికొన్ని గంటల్లోనే పెళ్లి పీటలెక్కబోతుంది. మీడియా బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేని పెళ్లాడనుంది. ఈ క్రమంలోనే సునీత ఇంట మెహందీ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో సునీత స్నేహితురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్‌తో పాటు సుమ కనకాల కూడా వచ్చారు. అక్కడే ఉండి సునీతను పెళ్లి కూతురును చేసారు. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలను ఆమె స్నేహితురాలు, నటి రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఈ వీడియోలో పసుపు చీరలో మెరిసిపోతున్న సునీత ముఖంలో పెళ్లి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సునీత చేతులకు మెహందీ పెట్టుకుని సిగ్గుపడుతూ కనిపించారు. సునీత సంప్రదాయబద్ధంగా పెళ్లి కూతురు అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంది. పిల్లలిద్దరు ముద్దుపెడుతున్న ఫోటో ఆకట్టుకుంటుంది. ఇక సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సునీతకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.