యువతకు బాబు సందేశం
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత భుజాన వేసుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, భావితరాల ప్రగతికి దోహదపడాలని చంద్రబాబు సూచించారు. పనిలో పనిగా సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో రాజకీయ ఉగ్రవాదం సాగుతోందని విమర్శించారు.
“67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆలయాలపై దాడులు, విధ్వంసాలు లేవు. ఇంతటి కక్షసాధింపు పాలన, హింసాత్మక చర్యలు గతంలో చూడలేదు. బీసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై ఇంతటి దమనకాండ ఏ రాష్ట్రంలోనూ లేదు. చట్టసభలు, పాలనాయంత్రాంగం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, మీడియాపై దాడి చేస్తున్నారు” అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.