‘క్రాక్2’కు గ్రీన్ సిగ్నల్

రవితేజ-గోపిచంద్ మలినేనిలది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే.. ఈ సినిమా చివ‌ర్లో సీక్వెల్ ఉంటుందని సూచ‌న ప్రాయంగా చెప్పేసింది చిత్ర‌బృందం. ఈ సినిమా సీక్వెల్ చేయ‌డానికి ర‌వితేజ కూడా రెడీగానే ఉన్నాడు. క్రాక్ జ‌రుగుతున్న‌ప్పుడే సీక్వెల్ చేద్దాం.. అని గోపీచంద్ మ‌లినేనికి చెప్పాడ‌ట ర‌వితేజ‌.

ఆ ధైర్యంతోనే క్లైమాక్స్ లో `క్రాక్ 2` వ‌స్తోంద‌ని చెప్ప‌గ‌లిగాడు. ర‌వితేజ దృష్టి మ‌రో సినిమాపై కూడా ఉంది. అదే `రాజా ది గ్రేట్`. అనిల్ రావిపూడి న‌టించిన ఈసినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా సీక్వెల్ కి త‌గిన క‌థ అనిల్ రావిపూడి ద‌గ్గ‌ర రెడీగా ఉంది. “రాజా ది గ్రేట్ సీక్వెల్ చేద్దామ‌ని అనిల్ నాతో చెప్పాడు. ఓ లైన్ కూడా వినిపించాడు. అది చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని రవితేజ క్రాక్ విజయోత్సవ సభలో చెప్పేశాడు.