బ్యాచిలర్ పండగ పిక్

సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకులకి గిఫ్ట్స్ క్యూ కడుతున్నాయి. కలర్ ఫుల్ గా పండగ పోస్టర్స్ ని విడుదల చేస్తున్నారు. తాజాగా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పండగ పోస్టర్ వచ్చేసింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్-పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రమిది. తాజా విడుదల చేసిన పండగ పోస్టర్ లో పూజాహెగ్డే అఖిల్ ను వెనక నుంచి హగ్ చేసుకొని చిరు నవ్వులు చిందిస్తోంది.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు, మూడు పోస్టర్స్ వచ్చేశాయ్. అయితే మొదటి నుంచి అఖిల్ ని పూజా డ్యామినేట్ చేస్తోంది. తాజా పిక్ లోనూ పూజాదే అప్పర్ హ్యాండ్. దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్నది సినిమాలో తెలియనుంది. సమ్మర్ లో రిలీజ్ చేస్తామని తాజా పోస్టర్ లో తెలిపారు. అఖిల్  నటిస్తున్న నాల్గో సినిమా ఇది. ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా పడని అఖిల్.. ఈ సినిమాపై భారీ అంచనాలు, ఆశలే పెట్టుకున్నాడు. మరీ.. అవి తీరాయామో చూడాలి !